Pakistan: పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళకు అత్యంత గౌరవం... పార్లమెంటు ఎగువ సభలో చోటు

  • సెనేట్ కు ఎన్నికైన కృష్ణ కుమారి కోహ్లీ
  • తొలి హిందూ దళిత మహిళగా రికార్డు
  • సింధ్ ప్రావిన్స్ నుంచి మహిళల కోటాలో పీపీపీ అవకాశం

పాకిస్థాన్ లో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ముస్లింల ఆధిపత్యం కలిగిన ఈ దేశంలో ఓ హిందూ మహిళకు ఎనలేని గౌరవం దక్కింది. 39 ఏళ్ల కృష్ణ కుమారి కోహ్లీ బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున ఆ దేశ ఎగువ సభ ‘సెనేట్’ కు ఎన్నికయ్యారు.

సింధ్ ప్రావిన్స్ నుంచి మహిళల కోటాలో ఆమె ఈ అవకాశం దక్కించుకున్నారు. పాక్ సెనేట్ కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళ ఈమే కావడం గమనార్హం. గతంలోనూ పీపీపీ తొలిసారిగా ఓ హిందూ మహిళ రత్న భగవాన్ దాస్ ను సెనేట్ కు ఎన్నుకుని చరిత్ర సృష్టించింది. ఈ సారి మరో అడుగు ముందుకు వేసి హిందు దళిత మహిళకు ఆ అవకాశం ఇచ్చింది.

More Telugu News