Tea seller: చరిత్ర సృష్టించిన పూణె చాయ్ వాలా.. నెలకు రూ.12 లక్షల ఆదాయం!

  • పూణెలో ప్రముఖ టీస్టాల్‌గా మారిన యెవ్లే టీ హౌస్
  • నగరంలో మూడు బ్రాంచ్‌లు
  • చాయ్ అమ్మడం ద్వారానూ ఉద్యోగాలు సృష్టించవచ్చన్న నవ్‌నాథ్ యెవ్లే

పూణెలోని ఓ చాయ్‌వాలా చరిత్ర సృష్టించాడు. కేవలం టీ విక్రయించడం ద్వారా నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. నగరంలోని ‘యెవ్లే టీ హౌస్’ ఇప్పుడు ప్రముఖ టీ స్టాల్‌గా మారిపోయింది. యెవ్లే టీ హౌస్ సహ వ్యవస్థాపకుడైన నవ్‌నాథ్ యెవ్లే మాట్లాడుతూ త్వరలోనే తమ బ్రాండ్‌ను అంతర్జాతీయంగానూ విస్తరిస్తామని పేర్కొన్నాడు.

పకోడా వ్యాపారంలా కాకుండా టీ అమ్మడం ద్వారానూ దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొన్నాడు. తన వ్యాపారం బాగా సాగుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం యెవ్లే టీ హౌస్‌కు నగరంలో మూడు సెంటర్లు ఉన్నాయి. ప్రతీ సెంటర్‌లో 12 మంది పనిచేస్తున్నారు. నెలకు రూ.12 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది.

More Telugu News