DHS: హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు శుభవార్త

  • వర్క్ పర్మిట్లపై నిర్ణయం జూన్‌కి వాయిదా  
  • హెచ్1-బీ, హెచ్-4 వీసాదారుల భాగస్వాములకు తాత్కాలిక ఊరట
  • వాయిదా నిర్ణయంపై భారత వృత్తి నిపుణుల ఆనందం

హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు మరీ ముఖ్యంగా భారతదేశ నిపుణులకు, వారి కుటుంబాలకు ఈ వార్త తప్పకుండా భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు సంబంధించిన వర్క్ పర్మిట్‌లపై నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారధ్యంలోని అమెరికా సర్కార్ ఓ నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. గ్రీన్ కార్డుల కోసం వేచి ఉన్న తమ భాగస్వాముల వల్ల అనుమతి భాగ్యాన్ని పొందే హెచ్1-బీ లేదా హెచ్-4 వీసాదారుల భాగస్వాములు సహా వృత్తి నిపుణులు వర్క్ పర్మిట్లపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రభావితులవుతారు. నిర్ణయం వాయిదా పడటంతో భారత వృత్తి నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అంతకుముందు అమెరికా హోం శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ-డీహెచ్ఎస్) ఈ వర్క్ పర్మిట్లపై గతనెల 28 కల్లా ఓ నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ, సమీక్షలో జాప్యం కారణంగా దీనిపై నిర్ణయాన్ని జూన్ నెలకు వాయిదా వేసింది. ఇది తప్పకుండా మనదేశానికి చెందిన వృత్తి నిపుణులకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హెచ్1-బీ ప్రోగ్రామ్ అనేది విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను ఉపయోగించుకుంటున్న వారిలో భారతీయులే అధికులు. తర్వాతి స్థానంలో చైనా ఉంది.

More Telugu News