sourav ganguly: పాకిస్థాన్ చాలా అందమైన దేశం: సౌరవ్ గంగూలీ

  • పాక్ ఎంత సున్నితమో, అంత కఠినం కూడా
  • ఇస్లామాబాద్ అద్భుతంగా ఉంటుంది
  • పాక్ పర్యటనలో ఎంతో బాగా చూసుకున్నారు

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన ఆటోగ్రఫీ 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పుస్తకంలో పలు విషయాలను పంచుకున్నాడు. మన దాయాది దేశం పాకిస్థాన్ పర్యటన గురించి కూడా వివరించాడు. పాకిస్థాన్ ఎంతో అందమైన, మనోహరమైన దేశమని దాదా చెప్పాడు. 2003 ప్రపంచకప్ తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్ కు భారత్ వెళ్లింది. ఆ అనుభవం గురించి గంగూలీ తెలిపాడు.

పాక్ ఎంత సున్నితంగా ఉంటుందో, అంతే కఠినమైనది కూడా అని చెప్పాడు. తాను పర్యటించిన గొప్ప ప్రదేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటని తెలిపాడు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ ఎంతో అందంగా ఉంటుందని... అక్కడి వీధుల్లో తిరిగితే, ఓ వైపు భవంతులు, మరోవైపు పర్వతాలు కనిపిస్తాయని చెప్పాడు. తమ పర్యటన సందర్భంగా పాకిస్థానీలు చూపించిన ప్రేమ మర్చిపోలేమని తెలిపాడు. అక్కడి భోజనం, సౌకర్యాలు అద్భుతమని కొనియాడాడు.

వన్డే మ్యాచ్ కోసం సియోల్కోట్ వెళ్లినప్పుడు... మ్యాచ్ జరగబోయే ఉదయం అందరం కలసి సరదాగా బయటకు వచ్చామని... అప్పటికే వీధికి రెండు వైపులా అభిమానులు పెద్ద సంఖ్యలో కనిపించారని గంగూలీ చెప్పాడు. ఏదేమైనప్పటికీ పాక్ లో పర్యటించడం ఆనందంగా ఉందని తెలిపాడు. 

More Telugu News