India: 'వామపక్ష ముక్త్ భారత్‌' కూడా సక్సెస్ అవుతోంది: కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌

  • త్రిపురలో సీపీఎమ్ కూటమికి ఎదురుదెబ్బ
  • ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 22 స్థానాల్లో గెలుపు, 19 స్థానాల్లో ఆధిక్యం
  • ఈశాన్య భారతమంతా బీజేపీయే: రవి శంకర్‌ ప్రసాద్‌

త్రిపురలో సీపీఎమ్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 22 స్థానాల్లో గెలుపొందగా, 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం కూటమి 8 స్థానాల్లో మాత్రమే గెలుపొంది మరో 10 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో 'కాంగ్రెస్ ముక్త్ భారత్‌'తో పాటు 'వామపక్ష ముక్త్ భారత్' కూడా సక్సెస్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక ఈశాన్య భారతమంతా బీజేపీతోనే ఉందని ఆయన అన్నారు. అప్పట్లో తాము కాంగ్రెస్ ముక్త్ భారత్ అని పిలుపునిచ్చామని, ప్రస్తుతం వామపక్ష ముక్త్ భారత్ కూడా ఎంతో దూరంలో లేదని  జోస్యం చెప్పారు.

More Telugu News