sloth bear: ఎలుగుబంటి పట్టుదలకు తోకముడిచిన పెద్దపులి.. వీడియో చూడండి!

  • నీటి కోసం మడుగుకు బయల్దేరిన ఎలుగుబంటి
  • ఆహారం కోసం వేటకు బయల్దేరిన పెద్దపులి
  • హోరాహోరీ తలపడిన ఎలుగుబంటి, పెద్దపులి

మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌ లో ఫిబ్రవరి 28న చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు క్రూరమృగాలు ఎదురెదురుగా తలపడిన ఘటన ఆకట్టుకుంటుండగా, ప్రమాదకరమైన జంతువుగా పేరొందిన పెద్దపులి, ఎలుగుబంటి చేతిలో కంగుతిని తోకముడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌ లో గత బుధవారం 35 డిగ్రీల సెల్సియస్ ఎండవేడిమిని తాళలేకపోయిన రెండు ఎలుగు బంట్లు దగ్గర్లోని నీటి మడుగు దగ్గరకు వస్తున్నాయి. అదే సమయంలో వేటకు వచ్చిన పెద్దపులి ఎదురైంది. సాధారణంగా మరేదైనా జంతువు అయితే పెద్దపులిని చూసి పరుగందుకునేదే... ఎలుగుబంటి అలా చేయలేదు. పులికి ఎదురెళ్లింది.

మీదపడ్డ పులితో హోరాహోరీ తలపడింది. దాంతో తనను ఒడిసిపట్టి తినేద్దామనుకున్న పెద్దపులి ఆటలు సాగలేదు. పులి పంజా దెబ్బలను ఒడుపుగా తప్పించుకుంటూ ఎలుగుబంటి ఎదురుదాడికి దిగింది. దీంతో చావుతప్పికన్ను లొట్టబోయిన పెద్దపులి ఈసురోమనుకుంటూ వెనుదిరిగింది. దీనికి సంబంధించిన వీడియో చూడండి. 

More Telugu News