manikarnika: పాత్రలో లీనమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నాను!: కంగన

  • 'మణికర్ణిక' సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్
  • 'మణికర్ణిక' సినిమాకి దర్శకత్వం క్రిష్ జాగర్లమూడి
  • షూటింగ్ సమయంలో చాలా సార్లు ప్రమాదాలకు గురయ్యాను

'మణికర్ణిక' సినిమా వల్ల తన ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపింది. రాజస్థాన్ లోని బికనీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చెప్పింది. ఈ పాత్ర తనకు సవాల్ లాంటిదని తెలిపింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా సార్లు తాను ప్రమాదాలకు గురయ్యానని చెప్పింది. పాత్రలో లీనమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నానంటే షూటింగ్ ఎలా సాగుతుందో ఊహించుకోవచ్చని కంగనా రనౌత్ తెలిపింది. 

More Telugu News