pari movie: అనుష్క శర్మ సినిమాను బ్యాన్ చేసిన పాక్.. అభ్యంతరకర సన్నివేశాలే కారణం!

  • 'పరి' సినిమాను నిషేధించిన పాకిస్థాన్
  • ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు
  • టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్న థియేటర్ల యాజమాన్యాలు

బాలీవుడ్ నటి అనుష్కశర్మ నటించిన 'పరి' సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, పాకిస్థాన్ మాత్రం ఈ చిత్రంపై బ్యాన్ విధించింది. పాక్ సెన్సార్ బోర్డు సినిమాను నిషేధించిందని... ఇందులోని కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయనే భావనతో నిషేధం విధించారంటూ 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ సందర్భంగా పాకిస్థాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఛౌదురి ఇజాజ్ కర్మా మాట్లాడుతూ, పాక్ సంస్కృతికి, ఇస్లామిక్ చరిత్రకు వ్యతిరేకంగా ఉన్న సినిమాలు ఇక్కడ తిరస్కరింపబడతాయని చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'ప్యాడ్ మన్' సినిమాను కూడా పాక్ నిషేధించిన సంగతి తెలిసిందే.

More Telugu News