Telangana: రూ. 30 లక్షల రివార్డున్న హరిభూషణ్, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావులు మరణించారు: పోలీసుల అధికారిక ప్రకటన

  • తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
  • 10 మంది మరణించారని పోలీసుల ప్రకటన
  • తీవ్రంగా గాయపడ్డ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్
  • న్యాయవిచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్

ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ తో పాటు ఆయన భార్య సమ్మక్కతో పాటు మరో ముఖ్య నేత బడే చొక్కారావు సహా 10 మంది మరణించారని పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించారు. ఆయన తలపై రూ. 30 లక్షల రివార్డు ఉందని, ఇటీవలి కాలంలో హరిభూషణ్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పరిధిలో మావోల కార్యకలాపాలు పెంచుతున్నారన్న సమాచారం ఉందని తెలిపారు. ఆయనపై 50 వరకూ కేసులు ఉన్నాయని, పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ ఎన్ కౌంటర్ లో తాము పోలీస్ కమాండర్ సుశీల్ ను పోగొట్టుకున్నామని తెలిపారు.ఇదిలావుండగా, ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఈ మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హరిభూషణ్ ను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2016 మార్చి 2న పట్టుకున్న పోలీసులు, రెండేళ్ల పాటు రహస్య ప్రాంతంలో విచారించి, నేడు హతుడైనట్టు ప్రకటించారని విప్లవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

More Telugu News