tg venkatesh: టీడీపీ ఎంపీల రాజీనామాలపై టీజీ వెంకటేష్ స్పందన!

  • ఎంపీల రాజీనామాలతో ఒరిగేది ఏమీ లేదు
  • పార్లమెంటు వేదికగా పోరాడతాం
  • అంచెలంచెలుగా వ్యూహాలను అమలు చేస్తాం
  • ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాల్సిందే

ఈనెల 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రయోజనాలను సాధించే క్రమంలో పార్లమెంటులో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై టీడీపీ, వైసీపీలు తలమునకలై ఉన్నాయి. మరోవైపు, ఎంపీలంతా రాజీనామాలు చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నలువైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందే అని చెప్పిన ఆయన... కేవలం ఎంపీల రాజీనామాలతో ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఏపీకి రావాల్సిన వాటిపై పార్లమెంటులో అంచెలంచెలుగా వ్యూహాలను అమలు చేస్తామని టీజీ చెప్పారు. పార్లమెంటు వేదికగా పోరాడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు టీజీ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

More Telugu News