charan: చరణ్ మూవీ కోసం బోయపాటికి భారీ పారితోషికం?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ఈ నెల 6 నుంచి రెండవ షెడ్యూల్ 
  • ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ  

చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను ఈ నెల 6వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. చరణ్ .. తదితరులపై ఈ యాక్షన్ సీన్స్ వుండనున్నాయి.

ఈ సినిమా కోసం బోయపాటి 15 కోట్లు పారితోషికంగా తీసుకోనున్నట్టు ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాకి ముందువరకూ ఆయన 10 కోట్ల వరకే తీసుకున్నాడట. ఈ సినిమాతో తొలిసారిగా ఆయన 15 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నాడని అంటున్నారు. రాజమౌళి విషయాన్ని పక్కన పెడితే, పారితోషికం విషయంలో త్రివిక్రమ్ .. కొరటాల సరసన తాజాగా బోయపాటి కూడా చేరిపోయాడని చెప్పుకుంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో చరణ్ న్యూ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.    

More Telugu News