rajanikanth: రజనీ నెక్స్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్

  • సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీకాంత్ 
  • దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 
  • అనిరుథ్ కి దక్కిన ఛాన్స్  

రజనీ అభిమానులంతా ఆయన చేసిన 'కాలా' .. '2.ఓ' సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తాయనే నమ్మకంతో వాళ్లు వున్నారు. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ బ్యానర్లో .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రజనీ అంగీకరించారు.

 ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ .. ఒక పోస్టర్ ను వదిలారు. అనిరుథ్ సంగీతాన్ని ఇష్టపడే వాళ్లంతా, ఈ సినిమాతో ఆయన మార్కెట్ మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి వుంది.    

More Telugu News