Anushka Sharma: పాత చీర కట్టుకుని దిగాలుగా కూర్చున్న లుక్ లో బాలీవుడ్ బ్యూటీ!

  • 'సూయి ధాగా' సినిమాలోని పల్లెటూరి మహిళ లుక్‌తో ఆసక్తి రేపిన సినీ బృందం
  • కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో అనుష్క శర్మ
  • గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళగా కనపడుతోన్న బాలీవుడ్ బ్యూటీ
  • సోషల్ మీడియాలో వైరల్‌

ఈ ఫొటోలోని బాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా? ఆమె న‌టిస్తోన్న 'సూయి ధాగా' సినిమాలోని ఈ లుక్‌ బయటకు వచ్చింది.. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇలా చీర కట్టుకుని దిగాలుగా కూర్చుని అభిమానులు గుర్తు పట్టలేనంతగా ఉంది. ఫస్ట్‌లుక్‌తోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులోనే కనపడుతూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసే అనుష్కశర్మ ఇలా కాటన్ చీరలో, చేతికి మట్టి గాజులతో కనపడుతోంది. ‘సూయి ధాగా’ సినిమాలో వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన దంపతులుగా నటిస్తున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా కనపడుతోంది.   

More Telugu News