Andhra Pradesh: నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద ఆంధ్ర, తెలంగాణ అధికారుల ఘర్షణ.. భారీగా మోహరించిన పోలీసులు

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కృష్ణా బోర్డు 10.5 టీఎంసీల నీళ్లు కేటాయింపు
  • ఇప్పటివరకు కుడికాల్వ ద్వారా 10.2 టీఎంసీలు విడుదల
  • మిగతా నీటిని వదలడం లేదని ఆరోపణ

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు వాగ్వివాదానికి దిగడంతో కలకలం రేగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కృష్ణా బోర్డు 10.5 టీఎంసీల నీటిని కేటాయించడంతో ఇప్పటివరకు 10.2 టీఎంసీలను కుడికాల్వ ద్వారా అధికారులు విడుదల చేశారు. అయితే, మరో 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండ‌గా, తెలంగాణ అధికారులు అడ్డుకున్నారని ఆంధ్రప్ర‌దేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు.

దీంతో ఉద్రిక్త‌తలు చెల‌రేగ‌కుండా అక్క‌డ‌ ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఆంధ్ర‌, తెలంగాణ అధికారులు చర్చలు జ‌రుపుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించిన నీటికంటే ఎక్కువ వాడుకొందని తెలియ‌డంతో ఇటీవ‌ల నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. 

More Telugu News