BSE: స్టాక్ మార్కెట్లు: ఆరంభంలో లాభాలు... తర్వాత నష్టాలలో కొనసాగుతున్న వైనం

  • ప్రజ్ ఇండస్ట్రీస్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లకు ఆదరణ
  • ప్రస్తుతం సెన్సెక్స్ 34385.35 పాయింట్ల వద్ద..నిఫ్టీ 10561.65 పాయింట్ల వద్ద 
  • పీఎన్‌బీ వ్యవహారంతో బ్యాంకింగ్ షేర్లు కుదేలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ, గంట సేపటిలోనే ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ సూచీ 60.40 పాయింట్ల మేర నష్టపోయి 34385.35 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా 20.95 పాయింట్ల మేర పడిపోయి 10561.65 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ప్రజ్ ఇండస్ట్రీస్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, మహీంద్రా  సీఐఈ ఆటో, సింఫోనీ, సెంచురీ ఫ్లైబోర్డ్స్ కంపెనీల షేర్లు లాభాల బాటలో ఉండగా; పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఒబెరాయ్ రియాల్టీ, వక్రాంజీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ షేర్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. కాగా, సెన్సెక్స్ సూచీ ట్రేడింగ్ ప్రారంభంలో 149 పాయింట్లు లాభపడి 34594.96 పాయింట్ల వద్దకు ఎగబాకింది. నిఫ్టీ సూచీ కూడా 44.30 పాయింట్ల లాభంతో 10627 పాయింట్ల వద్దకు దూసుకుపోయింది. ఆ తర్వాత మెల్లగా నష్టాలలోకి జారుకున్నాయి. 

More Telugu News