Donald Trump: డ్రీమర్స్ విషయంలో ట్రంప్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

  • డీఏసీఏ పథకాన్ని రద్దు చేయాలనుకుంటున్న ట్రంప్
  • ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్
  • కింది కోర్టులు పరిశీలించిన తరువాతే విచారిస్తామన్న సుప్రీంకోర్టు

చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అమెరికా వచ్చి, అక్కడే అక్రమంగా స్థిరపడిపోయిన వారిని స్వాప్నికులు (డ్రీమర్స్‌) అని పిలుచుకుంటారు. వీరంతా సుమారు 7 లక్షల మంది ఉంటారని అంచనా. వారంతా అమెరికాలో నివసించేందుకు అనుమతులిస్తూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన పథకమే డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా (The Deferred Action for Childhood Arrivals) పథకాన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దానికి సంబంధించిన అనుమతులు తెచ్చుకునేందుకు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ట్రంప్ పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరాకరించారు. కింది కోర్టులు పరిశీలించిన తర్వాతే తాము విచారిస్తామని ట్రంప్ కు జడ్జీలు స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. 

More Telugu News