Sridevi: బోనీకపూర్‌ ని దుబాయ్‌ విడిచి వెళ్లేందుకు వీల్లేదన్న పోలీసులు.. పాస్ పోర్ట్ స్వాధీనం!

  • ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేసిన దుబాయ్ పోలీస్
  • దుబాయ్ విడిచి వెళ్లేందుకు వీల్లేదంటూ బోనీకపూర్ కు ఆదేశాలు
  • బోనీ పాస్ పోర్ట్ స్వాధీనం? 

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి కేసుపై దుబాయ్ లో విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పోలీసులు బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే వరకూ దుబాయ్ విడిచి వెళ్లేందుకు వీల్లేదంటూ బోనీకపూర్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ పాస్ పోర్ట్ ను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

కాగా, ఈ కేసు విషయమై అడిగిన ప్రశ్నలకు బోనీకపూర్ చెప్పిన సమాధానాలతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందలేదని, మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉన్నట్టు సమాచారం. బోనీకపూర్, శ్రీదేవి కాల్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం భారత కాన్సులేట్ నుంచి మరిన్ని పత్రాలు కావాలని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి ఈరోజు తరలించే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది.

More Telugu News