Sridevi: శ్రీదేవి మృతి కేసు విచారణ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ.. భౌతికకాయం రావడంలో మరింత ఆలస్యం!

  • ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి చనిపోయిన శ్రీదేవి
  • ఇప్పటివరకు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పూర్తి  
  • ఈ కేసులో ఇంకా అనేక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉన్న వైనం
  • ఆమె మృతిపై పలు అనుమానాలు

ప్రముఖ సినీ నటి శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పారన్న సందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి. కాగా, యూఏఈ ఆరోగ్య శాఖ శ్రీదేవి మృతిపై ప్రకటన చేసిన అనంతరం దుబాయ్ పోలీసులు ఈ కేసు విచారణను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు.

ఈ క్రమంలో శ్రీదేవి భౌతికకాయం భారత్ రావడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంకా అనేక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె పార్థివదేహం స్వదేశానికి రావడానికి మరింత సమయం పడుతుంది.  

More Telugu News