singapur: రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చింది: చంద్రబాబు

  • విశాఖపట్నంలో ముగిసిన భాగస్వామ్య సదస్సు-2018 
  • పాల్గొన్న 280 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు
  • ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, సౌర విద్యుత్‌, టెక్స్‌టైల్‌ రంగాలపై సమీక్ష
  • రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న భాగస్వామ్య సదస్సు-2018 ఈ రోజు ముగిసింది. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. 50 దేశాల నుంచి, 280 అంతర్జాతీయ సంస్థలు సదస్సుకి వచ్చాయని తెలిపారు. చాలా దేశాలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు.

ప్రధానంగా సింగపూర్‌, రష్యా, జపాన్ పెట్టుబడులకు ముందుకు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ-సింగపూర్ బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటుకు సింగపూర్ ఆసక్తి చూపిందని అన్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, సౌర విద్యుత్‌, టెక్స్‌టైల్‌, వైద్య సంబంధిత అంశాలతో పాటు పర్యాటక రంగంపై కూడా ఈ సదస్సులో సమీక్షించారని తెలిపారు.

టెక్నాలజీ సాయంతో మెరుగైన, పారదర్శక సేవలు అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమలో ఆటోమొబైల్ హబ్ వస్తోందని చెప్పారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు వివరించామని తెలిపారు.

More Telugu News