samsung: గెలాక్సీ S9, గెలాక్సీ S9 ప్లస్ లను లాంచ్ చేసిన శామ్ సంగ్!

  • బార్సిలోనాలో జరుగుతున్న ఎండబ్ల్యూసీ 2018 ప్రదర్శనలో లాంచ్
  • మార్చి 2నుంచి ప్రి ఆర్డర్స్, మార్చి 16నుంచి విక్రయానికి అందుబాటు
  • మిడ్నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ మరియు పర్పుల్ కలర్ లలో లభ్యం

శామ్ సంగ్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S9, గెలాక్సీ S9 ప్లస్ లను బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో నిన్న లాంచ్ చేసింది. వచ్చే నెల 2 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానుండగా, అదే నెల 16 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ లలో ఫేస్‌ రికగ్నిషన్‌, AR (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ లు మిడ్నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ మరియు పర్పుల్ కలర్లలో అందుబాటులోకి రానున్నాయి.

గెలాక్సీ S9 ఫీచర్లు:

  • IP68 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రెసిస్టన్స్
  • 5.8" కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 8 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 4జీబీ ర్యామ్‌, 64జీబీ /128జీబీ/256జీబీ స్టోరేజ్(మైక్రో SD కార్డ్ ద్వారా 400జీబీ కి పెంచుకోవచ్చు)
  • 12ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • సింగల్ రేర్ కెమెరా
  • బ్లూ టూత్, యుఎస్బి పోర్ట్స్, వైఫై
  • 3000mAh బ్యాటరీ

గెలాక్సీ S9 ప్లస్‌ ఫీచర్లు:

  • IP68 సర్టిఫైడ్ వాటర్, డస్ట్ రెసిస్టన్స్
  • 6.2" కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌ 8 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 6జీబీ ర్యామ్‌, 64జీబీ/128జీబీ/256జీబీ స్టోరేజ్(మైక్రో SD కార్డ్ ద్వారా 400జీబీకి పెంచుకోవచ్చు)
  • 12ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • డ్యూయల్ రేర్ కెమెరా
  • బ్లూ టూత్, యుఎస్బి పోర్ట్స్, వైఫై
  • 3500mAh బ్యాటరీ

More Telugu News