shrawanand: యువకుడిగా .. మధ్య వయస్కుడిగా శర్వానంద్!

  • హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ 
  • రెండు విభిన్నమైన పాత్రలు 
  • కథానాయికగా సాయి పల్లవి

ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా .. హను రాఘవపూడితో ఒక సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడితో కలిసి ఆయన ఏప్రిల్ మూడవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'పడిపడిలేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రలను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్రలు ఎలా వుండనున్నాయోననే ఆసక్తి అందరిలో తలెత్తింది. ఈ సినిమాలో శర్వానంద్ 25 యేళ్ల యువకుడిగాను .. 45 యేళ్ల మధ్య వయస్కుడిగాను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్  ఒక పాత్ర కోసం బరువు తగ్గి .. మరో పాత్ర కోసం బరువు పెరగవలసి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే . 

More Telugu News