vishal: చికిత్స కోసం అమెరికా వెళ్లిన హీరో విశాల్

  • షూటింగ్ సందర్భంగా మోకాలికి గాయం
  • దీనికి తోడు తీవ్రమైన తలనొప్పి
  • ఇటీవలే ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స

సినీ హీరో విశాల్ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. గతంలో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. దాంతో ఆయన మోకాలికి గాయమైంది. దీనికి తోడు తీవ్రమైన తలనొప్పి కూడా ఆయనను బాధిస్తోంది. ఈ కారణాలతో ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, అక్కడ చికిత్స తీసుకున్నాడు. మరింత మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు అమెరికాకు వెళ్లాడు. చికిత్స ముగించుకుని, మరో పది రోజుల్లో ఇండియాకు తిరిగిరానున్నాడు.  

More Telugu News