Manohar parrikar: మళ్లీ అస్వస్థతకు గురైన గోవా సీఎం.. ఆసుపత్రిలో చేరిక

  • పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి
  • ఈ నెలలో ఇది రెండోసారి
  • అవసరమైతే అమెరికాకు తరలిస్తామన్న డిప్యూటీ స్పీకర్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్న ఆయనను ఆదివారం సాయంత్రం గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు. సీఎం డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని మంత్రి తెలిపారు. నిపుణులైన వైద్యులు 24 గంటలూ సీఎంను పర్యవేక్షిస్తున్నట్టు రాణె మీడియాకు తెలిపారు.

62 ఏళ్ల పారికర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్ గురువారమే డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆదివారం మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో గోవా ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ఈనెల 15న పారికర్ కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా గోవా ఆసుపత్రిలో చేరగా వారు ముంబై లీలావతి ఆసుపత్రికి రెఫర్ చేసినట్టు అధికారుల ద్వారా తెలిసింది. కాగా, డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లోబో మాట్లాడుతూ అవసరమైతే ముఖ్యమంత్రిని మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలిస్తామన్నారు.

More Telugu News