China: పదవిలో కొనసాగడానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కొత్త ఎత్తుగడ!

  • అధ్యక్షుడు, ఉపాధ్యక్ష పదవులకు ‘వరుసగా రెండుసార్లు మాత్రమే ’ కొనసాగే నిబంధన ఉంది 
  • ఆ నిబంధనకు చరమగీతం పాడనున్న జిన్ పింగ్
  • నిబంధనల సవరణకు కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతిపాదన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తనదైన శైలిలో ముందుకు సాగుతూ అధికారం చేజారకుండా ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీపై తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే అధ్యక్షుడిగా రెండు దఫాలు మాత్రమే కొనసాగే వీలుంది. ఇప్పుడు దీనికి ఆయన చరమగీతం పాడనున్నారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత హోదాను జిన్ పింగ్ కు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఇక రెండోసారి జిన్ పదవీకాలం ముగియకుండా రాజ్యాంగాన్ని సవరించాలని 205 మంది సభ్యులు ఉన్న కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్‌ కమిటీ ప్రతిపాదించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ సవరణతో ఆయన అధికారానికి ఇక ఎదురుండదు. అధ్యక్షుడిగా ఆయన స్థానం మరింత పదిలం కానుంది. ఇక ఎన్నేళ్లయినా ఆయన పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది.

More Telugu News