congress: శ్రీదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాప ట్వీట్.. విరుచుకుపడ్డ నెటిజన్లు

  • శ్రీదేవికి ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నివాళి
  • యూపీఏ హయాంలో పద్మశ్రీ ఇచ్చామన్న కాంగ్రెస్
  • ఇక్కడ కూడా రాజకీయాలేనా అంటూ నెటిజన్లు ఫైర్

సినీ నటి శ్రీదేవి మరణం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణ వార్త తెలిసినప్పటి నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా శ్రీదేవికి సంతాపం ప్రకటించింది.

'శ్రీదేవి తుదిశ్వాస విడిచారన్న వార్త వినడానికి చింతిస్తున్నాం. అత్యున్నతమైన నటి ఆమె. భౌతికంగా ఆమె దూరమైనా... అద్భుతమైన సినీ నటిగా ఆమె మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాం. 2013లో యూపీఏ ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది' అంటూ ట్వీట్ చేసింది.

 ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మహానటి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పద్మశ్రీ ఇచ్చామని చెప్పడం వల్ల... ఇప్పుడు మీకొచ్చే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో... కాసేపటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ ను తొలగించింది.

More Telugu News