nitin gadkari: నదుల ప్రక్షాళనకు రూ.10 లక్షల కోట్లు అవసరం: కేంద్ర మంత్రి గడ్కరీ

  • ప్రైవేటు సంస్థల నుంచి రూ.4 లక్షల కోట్లు తీసుకుంటున్నాం
  • కేంద్రం ఒక్కటే ఈ పనిచేయలేదు
  • రాష్ట్రాలు, కార్పొరేట్ల సాయం కూడా అవసరమే

దేశంలోని ప్రధాన నదులను ప్రక్షాళన చేసేందుకు ఎంతలేదన్నా కనీసం రూ.10 లక్షల కోట్లు అవసరం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎకనమిక్ టైమ్స్ ప్రపంచ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రూ.4 లక్షల కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పారు.

‘‘కేంద్రం ఒక్కటే ఈ పని చేయలేదు. రాష్ట్రాలు, కార్పొరేట్లు, స్థానిక సొసైటీలు, పౌరుల సాయం కూడా అవసరమే. కార్పొరేట్ల సామాజిక బాధ్యత కార్యక్రమంతోపాటు, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలు ఉన్నాయి’’ అని గడ్కరీ అన్నారు. ఈ బైకులు, ఈ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి చెప్పారు. వీటితో కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు తక్కువ ధరలకే రవాణా సాధ్యపడుతుందన్నారు.

More Telugu News