K.Raghavendra rao: 'అతిలోకసుందరి' హఠాన్మరణంపై రాఘవేంద్రరావు స్పందన

  • శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలి
  • ఆమె అధిరోహించని మైలురాయి లేదు
  • శోకసంద్రంలో సినిమా పరిశ్రమలు

"బాలనటి నుంచి మహానటి వరకు నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి హఠాన్మరణం అత్యంత బాధాకరం. భారతీయ చిత్ర పరిశ్రమకి ఇది తీరని లోటు. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. పదహారేళ్ల వయసు నుంచి అతిలోకసుందరి వరకు....తెలుగు, తమిళం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు...శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు" అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తన విచారాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు శ్రీదేవి సమకాలీన నటీమణి జయసుధతో పాటు నేటి స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్‌లు కూడా ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు ఎన్‌టీఅర్, రవితేజ, సీనియర్ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌తో పాటు యువ హీరోలు సుధీర్ బాబు, నాగశౌర్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, కమెడియన్ వెన్నెల కిశోర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కాగా, దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News