Sruthi hasan: నా గుండె పగిలిపోయింది...శ్రుతిహాసన్

  • పూర్తిగా షాక్‌కు గురయ్యాను
  • వార్త విన్నప్పటి నుంచి నోట మాటలు రావడం లేదు
  • శోకసంద్రంలో సినీ పరిశ్రమలు

నటి శ్రీదేవి (55) హఠాన్మరణంపై ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ తన బాధను వ్యక్తం చేసింది. ఆమె మరణంతో తాను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పింది. తన గుండెపగిలిపోయిందని పేర్కొంది. ఈ భయంకరమైన వార్త విన్నప్పటి నుంచి తన నోట మాటలు రావడం లేదని ఆమె తెలిపింది. శ్రీదేవి లాంటి ఒక గొప్ప నటి తన అభినయంతోనూ అందంతోనూ ఇతరులతో కలిసిమెలిసి పనిచేయడాన్ని చూడటం తనకు లభించిన ఓ గౌరవమని శ్రుతిహాసన్ పేర్కొంది. 

More Telugu News