RGV: మహిళలూ విశాఖపట్నం రండి.. నేనూ వస్తా.. చూసుకుందాం!: చర్చలకు రామ్ గోపాల్ వర్మ పిలుపు

  • 'స్త్రీ స్వేచ్ఛా సమావేశం' నిర్వహించనున్న వర్మ
  • తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణలు
  • నేను జైల్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు
  • మీటింగ్ కి వైజాగ్ వచ్చి నాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నాను

'స్త్రీ స్వేచ్ఛా సమావేశం' అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశాఖపట్నంలో మహిళలతో చర్చిస్తారట. 'ఇదే నా పిలుపు, సవాల్' అంటూ వర్మ ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న వివరాలు ఆయన రాతల్లోనే...

"స్త్రీ స్వేచ్చ గురించి, భావజాల స్వేచ్చ గురించి విశాఖపట్నంలో బహిరంగ మీటింగ్ కి నా పిలుపు. న్యూస్‌ చానెల్ లో నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి నా సమాధానం.
- రామ్ గోపాల్ వర్మ

ఏ అఫిషియల్ రుజువులు లేకుండా ఒకరు తప్పు చేశారని ఫిక్స్ అయ్యి, దాని సపోర్ట్ కి గాను చాలా మందిని రెచ్చగొట్టి వాళ్లతో నానా మాటలూ అనిపించి, వాళ్ల ఘర్షణలని TRP రేటింగుల కోసం వాడుకోవటం TV9కి ఆనవాయితీ అని రాష్ట్రంలో అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా ఒక మహిళకి ప్రమేయం ఏమీ లేకుండా ఏకపక్షంగా 'నీతో ఫలానా సినిమా తీస్తా' అని ఏ విధంగా , ఏ సందర్భంలో అని వుంటాను?

నా మామూలు పద్ధతిలో ఇంటర్వ్యూ మొత్తం సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటే, కేవలం ఆ ఒక్క బిట్ తీసుకొని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తే దేని పెర్స్పెక్టివ్ అయినా మారిపోతుంది. ఆ వ్యాఖ్యలకి ముందు ఏమన్నానో, తర్వాత ఏమన్నానో చూడండి. ముఖ్యంగా యాంకర్ కూడా సరదాగా తీసుకోవడం గమనించండి.

మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చెయ్యదలచుకున్నారు ? గురజాడగారు ఏమన్నారో తెలుసా ? మంచి అన్నది పెంచుమన్న అన్నారు మణిగారు.

పాయింట్ ఏమిటంటే, మణిగారు ఒక సంస్థకి ప్రతినిధి.. నేనేమీ అనకముందే నన్ను పర్వర్టెడ్, మెంటల్, సైకో అన్నారు. ఆవిడ ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి తెలియక మాట్లాడుతున్నారు అని నేను అనుకోవాలా?

పైగా ఆవిడ లైవ్ లో కూడా లేరు..... అది రికార్డెడ్ వీడియో. అంటే ఆవిడతో ఏమనిపిస్తే నేనిలా రియాక్ట్ అవుతానన్న స్కెచ్ అంతా TV9 దే అనుకోవాలా?

నా గురించి తెలిసుండీ, ఏళ్ల తరబడి నా అభిప్రాయాలు విని ఉండి కూడా ఆవిడ అలాంటి లెక్చర్లు ఇస్తే ఇక నేను సంయమనం కోల్పోనా? కానీ నేను మరీ అంతగా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయ్యాను.??

నేను 30 ఏళ్ళుగా రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీస్తున్నాను. నాకు సామాజిక బాధ్యత కన్నా నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ ఐన వాటి గురించే నా సినిమాల ద్వారా రెస్పాండ్ అవుతాను.

నేను కేవలం ఈ దేశ చట్టాలను , రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తాను అని ప్రతి ఇంటర్వ్యూ లో కొన్ని వందలసార్లు చెప్పాను. అలా నిన్న మొన్న కాదు, గత 30 ఏళ్లుగా చెపుతూనే ఉన్నాను.

అటువంటి నా దగ్గర గురజాడ ఏమన్నాడో తెలుసా, మంచి అన్నది పెంచుమన్న అని నీతి బోధలు చేస్తే ఎలా ఉంటుంది? "మంచి" అనే దాని డెఫినేషన్ నా బుర్రకి వేరు, మణిగారి బుర్రకి వేరు.

కొన్ని లక్షల పోర్న్ వీడియోలు 20 ఏళ్లుగా భారతీయులందరికీ అందుబాటులో ఉన్నా ఏ మాత్రం పట్టించుకోని వీళ్లు GST ఒక్కదాన్నే టార్గెట్ చెయ్యడంలోని అర్థం ఆ గొడవ చేస్తున్నవాళ్ళకే తెలియాలి... పోర్న్అనేది బై డెఫినిషన్ సెక్స్ చేసుకునే దృశ్యాలు ఉండటం....

నేను GST ఒక ఫీలోసోఫికల్ ట్రియటైస్ అని చెప్తూ ఉంటే, అది పోర్న్ అని ఫిక్స్ అయిపోయి మొత్తమందరికి అది పోర్న్ అని చాటి చెప్పి పోర్న్ ని ఇంకా పాపులర్ చేసింది Tv 9.

GST లో కేవలం నగ్నంగా ఉన్న, అది కూడా ఒక అమెరికన్ అమ్మాయి సెక్స్ గురించిన తన ఫీలోసోపి చెప్తుంది. సరే , అసహనానికి లోనయ్యి సంయమనం కోల్పోయి మాటతూలిన నేను ఆ తర్వాత అపాలజీ చెప్పాను. కానీ నిజానికి మహిళా ప్రతినిధులమని చెప్పుకునే ఆ చాలామంది మహిళలు నన్ను చట్ట వ్యతిరేకంగా ఎంకౌంటర్ చేసి చంపేయ్యాలని, నరబలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.... దానికి నేను వాళ్ళ మీద కేసులు పెట్టలా?
 
నా అభిప్రాయాలు ఎలాంటివైనా నేను దేశపు చట్టాన్ని గౌరవిస్తాను.... నేను GST నాకర్ధమైన చట్టాల పరిధిలోనే తీశాను..... అలా కాదని రుజువైననాడు ఆ చట్టం తీసుకునే చర్యలని ఫేస్ చెయ్యడానికి ఈ దేశపు పౌరుడిగా సిద్ధంగా ఉన్నాను.

నేనెక్కడ తీశాను, ఎప్పుడు తీశాను అనే టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారుగానీ నేనే నా నోటితో GST నేనే తీశానని ఎన్నోసార్లు చెప్పడమే కాకుండా నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో వీడియో స్క్రీన్ మీద కూడా వెయ్యడం జరిగింది. దాని తరువాత నేను తియ్యలేదని చెప్తున్నాను అని చేసే తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడంలో అర్థమేమిటి?

Film industry drug scandal గురించి 20 రోజులు non stop గా అరిచిన తర్వాత చివరికి ఏమైందనే సంగతి అందరికీ తెలిసిందే

GSTలో నేను చెప్పిన రివొల్యూషనరీ సెక్సువల్ ఫిలాసఫి ఈస్ in the context of a terrible suppression of women’s sexual freedom across the centuries
ఇవాళ ఆ స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడేవాళ్ల కన్నా నాకు ఆ టాపిక్ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది. I have been a voracious reader of each and every philosophy written in the entire world .... నేను వాటిల్లోనుంచి సంపాదించిన నా జ్ఞానంలో నుంచి వచ్చిన, నేను నమ్మిన నా నమ్మకాల కోసం జీవిస్తాను...

నాకెదురయ్యే ప్రతి పరిణామాలకి నేనే పూర్తి బాధ్యత తీసుకుంటూ దాని ద్వారా వచ్చే కష్టనష్టాలని ఎదుర్కుంటూ, నా జీవితాన్ని అన్నిరకాలుగా అనుభవిస్తూ చచ్చే వరకూ నా దారిలోనే నేను వెళ్తూనే ఉన్నాను ... వెళ్తూనే ఉంటాను.

నన్ను అరెస్ట్ చెయ్యమని జైల్లో పెట్టమని మాటిమాటికి డిమాండ్ చేస్తున్నవాళ్ళందరికీ నాదొక్కటే సమాధానం.

నేను డబ్బులున్నా, లేకపోయినా, నా ఆఫీస్ చెట్టు కిందున్నా, భవంతిలో ఉన్నా, నేను బయటున్నా, జైల్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నేను కేవలం నా ఆలోచనల్లో బ్రతుకుతాను...... నా బాడీ ఎక్కడుందనేది నాకు పాయింటే కాదు.
బయటుండి జైళ్లలాంటి మనసులతో బతికేకన్నా, జైల్లో ఉండి స్వేచ్చా ఆలోచనలతో బతకడం 1000 రెట్లు బెటర్.

చివరి మాటగా నేను చెప్పేది - ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా నేను నమ్మే నా అభిప్రాయాలకోసం నేను బ్రతుకుతున్నాను. అలా బ్రతకలేని రోజున చస్తాను కానీ నా రూట్ మాత్రం నేను మార్చుకోను.

“An active minority becomes visible and the silent majority suffers in darkness” అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా... నేను చెప్పేది సపోర్ట్ చేస్తున్నవాళ్ళందరూ సైలెంట్ గా ఉండటం మూలాన దీనిని ప్రతిఘటిస్తున్నవాళ్ళు మాత్రమే మొత్తం దేశానికి ప్రతినిధులనుకునే ప్రమాదముంది. ..

ఈ సెల్ఫ్ అపాయింటెడ్ మోరల్ ప్రతినిధులమనుకునే వాళ్ళకి అందరూ వాళ్లలాగానే ఆలోచించరని తెలియచెప్పటానికి వాళ్ళకి వాళ్ళు మీటింగులు పెట్టుకున్నట్టే నా లాగా ఆలోచించేవాళ్లు ఎవరున్నా మనమందరమూ కూడా కలిసి March 7న విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకుందాం.

అదే టైమ్ లో ప్రొటెస్టర్స్ ని కూడా మీటింగ్ పెట్టుకొమ్మని నా ఛాలెంజ్. ఏ మీటింగ్ కి ఎక్కువమంది వస్తారో పూర్తి నిజం ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది.

నా మీటింగ్ కి యువత, కాలేజ్ స్టూడెంట్లు, గృహిణులు, నా రాముఇజం సిరీస్ చూసినవాళ్లు, నా ఆలోచనలతో ఏకీభవించే అందరూ ఆహ్వానితులే. మీడియా అందరికీ ఆ మీటింగ్ కి రమ్మని ఇదే నా ఇన్విటేషన్ , Tv 9 గారు! దమ్ముంటే వచ్చి ఆ మీటింగ్ కవర్ చేయండి.

“Regressive thoughts will prevail in the absence of not shouting out the progressive thoughts” అన్నారు అయాన్ రాండ్.

Silent గా ఉంటే అరుపులే నిజమనుకుంటుంది ఈ లోకం....... అందుకని మనం కూడా అరవాల్సిన టైమ్ వచ్చింది.

నా స్త్రీ స్వేచ్చా మీటింగ్ కి వైజాగ్ వచ్చి నాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు రావాల్సిన అవసరముంది.... ఇది నా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ స్వేచ్ఛ కోసం, రిగ్రెస్సివ్ థింకింగ్ నుంచి ప్రోగ్రెస్సివ్ థింకింగ్ లోకి వెళ్లాల్సిన మీ అవసరం కోసం.

Let us all meet in Vishakapatnam on March 7th to demonstrate the power of GOD’s TRUTH behind UGLY LIES

VENUE and TIME will be told soon
#WomenPower

“Honest people remaining silent makes dishonesty Shout from the roof tops” —Voltaire

--- రామ్ గోపాల్ వర్మ"  అంటూ అందులో ఆయన పేర్కొన్నారు.

More Telugu News