Narendra Modi: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంపై ఎట్టకేలకు స్పందించిన ప్రధాని మోదీ

  • ఎకనామిక్స్‌ టైమ్స్‌ నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో మాట్లాడిన మోదీ
  • ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • ప్రజాధనం దుర్వినియోగం చేయటం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు
  • మా ప్రభుత్వం ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తుంది

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. కోట్లాది రూపాయ‌లు తీసుకుని వడ్డీ, అసలు కట్టకుండా ఈ ఏడాది జనవరిలో వ్యాపార‌వేత్త‌ నీరవ్‌ మోదీ విదేశాలకు చెక్కేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సంబంధించిన ఇళ్లు, స్థిర, చరాస్తులను ఈడీ సీజ్‌ చేసి సోదాలు కొన‌సాగిస్తోంది. కాగా, ఈ కుంభ‌కోణంపై ఇన్ని రోజులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మౌనంగా ఉన్న విష‌యం తెలిసిందే. రూ.11,400 కోట్ల ఈ కుంభకోణంపై ఆయ‌న స్పందిచడం లేద‌ని, కాంగ్రెస్ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు.

ఈ క్రమంలో ఎట్ట‌కేల‌కు మోదీ ఈ విష‌యంపై స్పందించారు. ఎకనామిక్స్‌ టైమ్స్‌ నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో మోదీ మాట్లాడుతూ.. ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, త‌మ‌ ప్రభుత్వం ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేద‌ని చెప్పారు.     

More Telugu News