kalyan ram: 'ఎమ్మెల్యే' నుంచి బ్యూటిఫుల్ పోస్టర్

  • కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే' 
  • కథానాయికగా కాజల్ 
  • అందమైన జోడీగా మంచి మార్కులు

ప్రస్తుతం కల్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ సినిమాల్లో 'ఎమ్మెల్యే' ( మంచి లక్షణాలున్న అబ్బాయ్) ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది.

 తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర కల్యాణ్ రామ్ .. ప్రేమతో కాజల్ కి ఏదో తినిపిస్తూ ఉండటం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. కల్యాణ్ రామ్ .. కాజల్ ఇద్దరి జోడీ చాలా బాగుంది. గత సినిమాల్లో కంటే ఇద్దరూ మరింత గ్లామర్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు త్వరలో ఊపందుకోనున్నాయి. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.   

More Telugu News