Chiranjeevi: ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలోకి దక్షిణాది సినీ తారలను తీసుకువస్తా: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • ఉద్యమంలోకి చిరు, కమల్, రజనీ తదితర తారలు
  • 'ఆంధ్రా హోదా ఉద్యమ కెరటం' పేరుతో కార్యక్రమం
  • మార్చి 5న విశాఖపట్నంలో నిర్వహించే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాని కల్పించే దిశగా దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన అగ్రతారలను ఏకతాటిపైకి తీసుకొస్తానని నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. 'ఆంధ్రా హోదా ఉద్యమ కెరటం' పేరుతో విశాఖపట్నంలో త్వరలోనే ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మార్చి 5 లోగానే ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు.

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లకు చెందిన చిరంజీవి, రజనీకాంత్, కమలహాసన్, విశాల్, ఉపేంద్ర, మమ్ముట్టి లాంటి వారిని కలిసి వారందరినీ ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేస్తానని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాయని, అయితే వాటి అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధన కోసం అగ్ర తారలందరినీ కలుపుకుపోతానని ఆయన చెబుతున్నారు. ఇదే అంశంపై చెన్నైలో జరిపిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని ఆయన అన్నారు.

More Telugu News