venkatesh: నాన్ స్టాప్ షూటింగుకి రెడీ అవుతోన్న వెంకటేశ్

  • తేజ దర్శకత్వంలో వెంకటేశ్ 
  • మార్చి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • కథానాయికగా శ్రియ

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకోవాలనుకున్నారు గానీ కుదరలేదు. దాంతో శ్రియను ఎంపిక చేసుకున్నారు. ఇక మిగతా నటీనటులంతా దాదాపుగా కొత్తవారే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావలసింది. కానీ కొత్త నటీనటులకు శిక్షణ ఇవ్వవలసి రావడంతో ఆలస్యమైందని అంటున్నారు.

 మార్చి 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు నుంచి నాన్ స్టాప్ షూటింగ్ జరపనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ దృష్టిపెట్టవలసి వుంది. అలాగే వెంకటేశ్ కూడా అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 

More Telugu News