singer sunitha: ఇది నా నంబర్ కాదు.. జాగ్రత్త!: సింగర్ సునీత

  • కాల్ చేస్తే ట్రూకాలర్ నా పేరు చూపిస్తోంది
  • చాలా దారుణంగా మిస్ యూజ్ చేస్తున్నారు 
  • జాగ్రత్తగా ఉండండి.. ఈ నంబర్ నాది కాదు

మొబైల్ నుంచి 7799328745 నంబర్ కు కాల్ చేస్తే... సునీత, ఆంధ్రప్రదేశ్ అని ట్రూకాలర్ చూపిస్తోందని సినీ గాయని సునీత తెలిపారు. సునీత  పేరుమీద ఈ నెంబర్ ను ఎవరో రిజిస్టర్ చేయించారని, చాలా దారుణంగా మిస్ యూజ్ చేస్తున్నారని వాపోయారు. ఈ నెంబర్ ద్వారా సెలబ్రిటీలతో చాటింగ్, మెసేజింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు.

 డౌట్ వచ్చిన వారు కొందరు... ఆ నంబర్ కు మళ్లీ కాల్ బ్యాక్ చేస్తే, లిఫ్ట్ చేయడంలేదని చెప్పారు. ఈ నంబర్ తనదా, కాదా అనే సందేహాన్ని తీర్చుకోవడం కోసం... ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్నేహితులు తనకు ఫోన్ చేసి, క్లారిఫై చేసుకున్నారని తెలిపారు. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్, తన శ్రేయస్సు కోరే వారి కోసం ఈ పోస్ట్ చేస్తున్నానని చెప్పారు. ఇది తన నంబర్ కాదని... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

More Telugu News