rajani: రజనీ కోసం కార్తీక్ సుబ్బరాజ్ రెడీ చేసిన కథపైనే అందరి చూపు!

  • కళానిధి మారన్ నిర్మాణంలో రజనీ మూవీ 
  • దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్
  • కొత్తదనం .. కథా కథనాలే ప్రధాన బలం  

రజనీకాంత్ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారని అంతా అనుకుంటూ ఉండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయడానికి ఆయన అంగీకరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అని తెలిసి మరింతగా ఆశ్చర్యపోయారు.

ఎంతోమంది సీనియర్ దర్శకులు రజనీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుండగా, ఆయన కార్తీక్ సుబ్బరాజ్ ప్రాజెక్టును ఓకే చేయడంతో, ఆ కథ ప్రత్యేకత ఏమై ఉంటుందా అనే ఆసక్తి తలెత్తుతోంది. 'కబాలి' .. 'కాలా' మాదిరిగా ఈ సినిమాలో మరీ స్టైలీష్ గా రజనీకాంత్ కనిపించడనేది తాజా సమాచారం. కథా కథనాలు కొత్తగా .. బలంగా వుంటాయని మాత్రం తెలుస్తోంది. ఈ కారణంగానే రజనీ ఈ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందనీ .. ఈ ఏడాది చివరినాటికి షూటింగును పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు. 

More Telugu News