kothapalli subhbarayudu: మెరుగుపడని కొత్తపల్లి ఆరోగ్య పరిస్థితి.. చంద్రబాబు ఆరా.. చిరంజీవి సూచనతో అపోలోకు తరలింపు!

  • వెంటిలేటర్ పై కొత్తపల్లికి చికిత్స
  • నాలుగు రోజులైనా కనపడని మార్పు
  • నిన్న రాత్రి అపోలో ఆసుపత్రికి తరలింపు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అయనప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. వైద్యం అందుతున్న సమయంలో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఐసీయూకు తరలించి, వెంటిలేటర్లపై ఉంచినా, పరిస్థితిలో మార్పు రాలేదు.

దీంతో, నిన్న రాత్రి ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలోలో కూడా ఆయనను వెంటిలేటర్లపై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడితే... ఆయన సాధారణ స్థితికి వస్తారని చెప్పారు.

మరోవైపు, కొత్తపల్లి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. మీరు కోరుకున్న ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కొత్తపల్లి కుటుంబసభ్యులకు ధైర్యం కల్పించారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్తపల్లి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చిరంజీవి సూచనల మేరకే అపోలో వైద్యులు వచ్చి, ఆయనను తీసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది.

More Telugu News