USA: రష్యాతో కలిసి సిరియా అధ్యక్షుడు యుద్ధనేరాలకు పాల్పడుతున్నారు: అమెరికా ఆరోపణలు

  • బషర్ అల్ అసద్ యుద్ధనేరస్థుడు
  • సొంత ప్రజలపైనే వైమానిక దాడులకు పాల్పడుతున్నారు
  • సిరియాలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం

రష్యా సహకారంతో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడని అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న తూర్పు గౌటా ప్రాంతాన్ని వశపర్చుకునేందుకు రష్యా సహకారంతో సిరియా సైన్యం వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీంతో గత ఐదురోజుల్లోనే 403 మంది సామాన్యులు ప్రాణాలు విడువగా, అందులో 95 మంది అభం శుభం తెలియని చిన్నారులు ఉండడం కలచివేస్తోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా సిరియా అధ్యక్షుడుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రజలనే బషర్ అల్ అసద్ చంపుకొంటున్నాడని ఆరోపించింది. తిరుగుబాటుదారులపై దాడుల పేరిట సామాన్య ప్రజానీకాన్ని బలితీసుకుంటున్నాడని మండిపడింది. అసద్‌ ను యుద్ధనేరస్తుడిగా అభివర్ణించిన అమెరికా, సిరియాలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. 

More Telugu News