mammootty: దుండగులు నా సోదరుడి లాంటి వ్యక్తిని చంపేశారు!: మమ్ముట్టి ఆవేదన

  • మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువ‌కుడిని కొట్టిన కేరళ యువకులు
  • కొడుతూ సెల్ఫీ తీసుకున్న వైనం
  • మనిషిగా ఆలోచించాలి-మమ్ముట్టి
  • అతడికి కూడా హక్కులు ఉంటాయి

చోరీల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపిస్తూ మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువ‌కుడిని కొంద‌రు క‌ట్టేసి కొట్టిన విష‌యం తెలిసిందే. అత‌డిని కొడుతుండ‌గా వారు సెల్ఫీలు కూడా దిగారు. కేర‌ళ‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రికీ ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఆ యువ‌కుడిని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందాడు. ఆ యువ‌కుడి పేరు మ‌ధు అని తెలిసింది. దీనిపై స్పందించిన సినీన‌టుడు మ‌మ్ముట్టి త‌న‌ ఫేస్‌బుక్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అత‌డు ఆదివాసి కాదని, త‌న‌ సోదరుడు లాంటి వాడని, దుండగులు త‌న‌ సోదరుడిని చంపేశారని ఆయ‌న అన్నారు. మనిషిగా ఆలోచిస్తే చనిపోయిన మధు నిందితుల‌కి కూడా సోదరుడిగా, కుమారుడిగా కనిపిస్తాడ‌ని పేర్కొన్నారు. అతడు మనలాగే పౌరుడని, అతడికి కూడా హక్కులు ఉంటాయని, ఆకలి కోసం దొంగతనం చేసేవారిపై దొంగ అనే ముద్రవేయకూడదని, పేదరికాన్ని సమాజమే సృష్టించిందని భావోద్వేగ పూరితంగా పోస్ట్ చేశారు. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం తప్పని పేర్కొంటూ, 'సారీ మధు' అని అన్నారు మమ్ముట్టి.    

More Telugu News