Uttar Pradesh: పెట్రోల్‌ బంక్‌లో కారు బీభత్సం.. సీసీ కెమెరాలో రికార్డు

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కానౌజ్‌లో ఘటన
  • అదుపుతప్పి దూసుకొచ్చిన కారు
  • ఒకరికి గాయాలు
  • ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కానౌజ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో కారు బీభత్సం సృష్టించింది. పెట్రోల్ బంకులోకి వస్తోన్న సదరు కారు ఒక్కసారిగా అదుపు తప్పి ముందుకు దూసుకొచ్చింది. ఆ ఊపులో అది అప్పటికే అక్కడ తన వాహనంలో పెట్రోల్ పోయించుకుంటోన్న ద్విచక్ర వాహనదారుడిపైకి దూసుకెళ్లింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.

కాగా, ఈ ఘటనలో పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు మరో యువకుడు తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ కారు బ్రేకులు విఫలం కాడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  

More Telugu News