Supreme Court: సునంద పుష్కర్ హత్య కేసులో కదలిక... ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

  • బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
  • ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం
  • పిటిషన్ చెల్లుబాటు గురించి చెప్పాలన్న కోర్టు

కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు విషయంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసును ఢిల్లీ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తుండగా, దర్యాప్తు తీరుపై స్వామి తన పిటిషన్ లో సందేహాలు వ్యక్తం చేశారు.

కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణకు ఆదేశించాలన్న స్వామి పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవరాయ్ తో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్, ఈ పిటిషన్ విచారణకు నిలబడే అర్హతపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని స్వామిని కోరింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లోగడ స్వామి పిటిషన్ ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు, తమ రాజకీయ అవసరాల కోసం కోర్టులను ఇలా వాడుకోవడం సరికాదని ఘాటుగా స్పందించింది.

More Telugu News