getup srinu: చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు .. ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నాను: గెటప్ శ్రీను

  • చిరంజీవి .. రవితేజ పడిన కష్టాల గురించి విన్నాను 
  • వాళ్లు సాధించిన సక్సెస్ లు చూశాను
  • అదే స్ఫూర్తితో నటన వైపుకు వచ్చాను 

'జబర్దస్త్' వేదికపై వివిధ రకాల గెటప్స్ వేస్తూ నవ్వించే గెటప్ శీను, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. " ఓ పల్లెటూరి నుంచి .. వ్యవసాయం కుటుంబం నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు. ఏదైనా పని చూసుకుందామని వచ్చారా? నటుడు కావాలనే క్లారిటీతోనే వచ్చారా?" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " నటన విషయంలో నాకు మొదటి నుంచి చిరంజీవిగారే స్ఫూర్తి. చిరంజీవి .. రవితేజ ఎలాంటి నేపథ్యం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు .. ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు .. ఏ స్థాయికి చేరుకున్నారు? అనే విషయాలను నేను విని వున్నాను .. అక్కడక్కడా చదివాను కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ దారిలో వెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి చాలా రోజుల పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ .. ఇక్కడి వరకూ రాగలిగాను" అంటూ చెప్పుకొచ్చాడు .  

More Telugu News