mobile world congress: మరో రెండు రోజుల్లో ప్రపంచ మొబైల్ కంపెనీల మహా సదస్సు... అతిపెద్ద ఆవిష్కరణలు ఇవే!

  • బార్సెలోనాలో 26న మొదలు
  • మార్చి 1వరకు కొనసాగనున్న సదస్సు
  • ప్రపంచవ్యాప్త కంపెనీలన్నీ ఒక వేదికపైకి

మొబైల్ పరిశ్రమకు చెందిన మహా మహ కంపెనీలన్నీ ఒకే చోటకు చేరే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు ఈ నెల 26న స్పెయిన్ లోని బార్సెలోనాలో మొదలు కాబోతోంది. మార్చి 1 వరకు ఇది కొనసాగుతుంది. ఈ విడత టాప్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా ఆవిష్కరణలు జరుగుతాయన్న అంచనాలు ఈ కింది మోడళ్లపైనే వున్నాయి.

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్9 మోడల్, ఎస్ 9+, నోకియా 9, నోకియా 8ప్రో, నోకియా 7ప్లస్, నోకియా 1, సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్2,  ఎక్స్ జెడ్2 కాంపాక్ట్, ఆసుస్ జెన్ ఫోన్ 5, జెన్ ఫోన్ 5 లైట్, ఎల్జీ కే10, కె8 మోడళ్లను ఈ సదస్సులో ప్రదర్శించొచ్చు.

More Telugu News