Child pornography: అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ ఆటకట్టించిన సీబీఐ.. ప్రధాన నిందితుడి అరెస్ట్

  • నిందితుడు నిఖిల్ వర్మను అరెస్ట్ చేసిన సీబీఐ
  • అతడి వాట్సాప్ గ్రూప్‌లో వివిధ దేశాలకు చెందిన 100 మంది
  • ఇప్పటికే 3500 చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ల మూసివేత

వాట్సాప్ గ్రూపుల ద్వారా పలు దేశాల్లోని కస్టమర్లకు పంపుతున్న అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నిఖిల్ వర్మ అనే వాట్సాప్ అడ్మిన్‌ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ తెలిపింది. నిందితుడి నుంచి చిన్నారుల అశ్లీల వీడియోలు స్టోర్ చేసిన మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

చిన్నారుల అశ్లీల వీడియోలను వందమంది ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ గ్రూపులో పాకిస్థాన్, అమెరికా, చైనా, శ్రీలంక సహా మరికొన్ని దేశాల వారు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో నిఖిల్ వర్మతో పాటు నఫీజ్ రేజా, ఢిల్లీకి చెందిన జహీద్, ముంబైకి చెందిన సత్యేంద్ర ఓం ప్రకాశ్ చౌహాన్, నోయిడాకు చెందిన ఆదర్శ్‌లపై కేసులు నమోదయ్యాయి. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం ఇప్పటికే 3500 వెబ్‌సైట్లను మూసివేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

More Telugu News