Ram Gopal Varma: ఆ వార్తల్లో నిజం లేదు.. ఆ చానల్ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది: వర్మ

  • పోలీసులు నన్ను రెండో విడత విచారణకు పిలవలేదు
  • ఆ చానల్ నన్ను సైకోగా చిత్రీకరిస్తోంది
  • చానల్‌తోపాటు, బీజేపీ నేత పద్మపైనా కేసు వేస్తున్నా
  • స్పష్టం చేసిన వర్మ

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వివాదంపై పోలీసు విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ నేటి విచారణకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల వర్మను మూడు గంటలపాటు విచారించిన పోలీసులు తిరిగి శుక్రవారం రెండో విడత విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారని వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం తాను హాజరుకాలేనని, సోమవారం వస్తానని వర్మ పోలీసులకు చెప్పినట్టు ఓ మీడియా చానల్ పేర్కొంది.

ఈ కథనాలపై స్పందించిన వర్మ.. పోలీసులు తనను రెండోసారి విచారణకు పిలవలేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు చానల్‌పై కేసు వేస్తున్నట్టు పేర్కొన్నాడు. కొందరు తనను విపరీత ప్రవృత్తి కలవాడిగా, సైకోగా, ఉగ్రవాదిగా ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఇష్టానుసారం వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న చానల్‌పై క్రిమినల్ సహా పలు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నాడు. అలాగే బీజేపీ నేత తుమ్మలపల్లి పద్మపైనా కేసు వేయనున్నట్టు తెలిపాడు. రాంగోపాల్ వర్మ, అతడి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని గురువారం పద్మ సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News