Gujarat: రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. ఎగిరిపడ్డ వ్యక్తి.. చిన్న గాయం కూడా కాని వైనం!

  • గుజరాత్‌లో ఘటన
  • సీసీ కెమెరాలో రికార్డు
  • ప్రమాదం తరువాత మామూలుగా నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి

గుజరాత్‌లో ఓ వ్య‌క్తి రోడ్డు దాటడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎడ‌మ‌వైపు నుంచి ఏవైనా వాహ‌నాలు వ‌స్తున్నాయా? అని చూశాడు. అదే స‌మ‌యంలో కుడివైపున వ‌స్తోన్న వాహ‌నాన్ని మాత్రం చూసుకోలేదు. డంపర్‌ లారీ ఒక్క‌సారిగా వ‌చ్చి అతనిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్య‌క్తి ఎగిరిప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికీ అతనికి ఏమీ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. చిన్న‌ గాయం కూడా కాకుండా బ‌య‌ట‌ప‌డిన ఆ వ్య‌క్తి అనంత‌రం ఎవరి సాయం లేకుండానే తిరిగి లేచి, తాపీగా న‌డుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో చిక్కాయి. మీరూ చూడండి...   

More Telugu News