sharad pawar: అందుకే, నేను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశాను: శరద్‌ పవార్‌

  • అప్పుడు, వాజ్‌పేయ్ సర్కారు పడిపోయింది
  • 1999లో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారు
  • నాకు నచ్చలేదు
  • ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా మార్పు

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్ గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన‌ విష‌యం తెలిసిందే. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని తెలిపారు. వాజ్‌పేయ్ సర్కారు పడిపోవడంతో 1999లో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారని, ఆ కారణం వల్లే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కాకపోతే దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా చక్కని నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయని, ఆయన దేశంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని అన్నారు. ఏదో నేర్చుకోవాలనే తపన కాంగ్రెస్ అధ్యక్షుడిలో కనపడుతోందని చెప్పారు. కాగా, లోక్‌సభలో మాట్లాడుతూ మోదీ చేస్తోన్న విమర్శలు బాగోలేవని ఆయన అభిప్రాయపడ్డారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ను మోదీ విమర్శించిన తీరును దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

More Telugu News