global corruption index: అవినీతి దేశాల్లో మన తాజా ర్యాంకు 81... రెండు స్థానాలు కిందకు

  • 2016లో 79వ స్థానం... తాజాగా 81
  • అవినీతి స్కోరులో మార్పు లేదు... 40
  • వెల్లడించిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్
  • మీడియా స్వేచ్ఛలో దారుణంగా ఉందని వ్యాఖ్య

ప్రపంచ దేశాల్లో అవినీతి పరంగా భారత్ రెండు స్థానాలు కిందకు జారింది. 2016లో 176 దేశాల జాబితాలో 79వ స్థానంలో ఉన్న భారత్ 2017 ప్రపంచ అవినీతి సూచీలో 81వ స్థానానికి వెళ్లిపోయింది. ఈ సారి 180 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వివరాలను బెర్లిన్ కేంద్రంగా పనిచేసే ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. లంచాలు, మీడియా స్వేచ్ఛ విషయంలో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే దారుణ స్థితిలో ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించడం గమనార్హం. భారత్, పిలిప్సీన్స్, మాల్దీవుల్లో జర్నలిస్టులు, ఉద్యమకారులు, ప్రతిపక్ష నేతలు, దర్యాప్తు సంస్థల ఉద్యోగులను బెదిరించడం, కొన్ని సందర్భాల్లో చంపడం వంటి పరిస్థితులున్నట్టు పేర్కొంది.

ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతికి 1 నుంచి 100 వరకు స్కోరు కేటాయించింది. 0 అనేది అత్యంత అవినీతికి నిదర్శనం. 100 అనేది ఈ విషయంలో అత్యంత మెరుగైన స్థానానికి కొలమానం. భారత్ స్కోరు 40. గతేడాదితో పోలిస్తే ఏ మాత్రం మారలేదు. 2015లో మాత్రం 38. న్యూజిలాండ్, డెన్మార్క్ 89, 88 స్థానాలతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. సిరియా, దక్షిణ సూడాన్, సోమాలియాలో అవినీతి దారుణంగా ఉంది. వీటి స్కోరు వరుసగా 14, 12, 9 గా ఉంది. చైనా స్కోరు 41.

More Telugu News