neerva modi: నీరవ్ మోదీ ఆస్తులపై దాడులు ఉద్ధృతం.. లగ్జరీ కార్ల స్వాధీనం!

  • నీరవ్ కు చెందిన 9 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్న ఈడీ
  • అందులో రోల్స్ రాయిస్, మెర్సిడెజ్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు
  • ఈడీ స్వాధీనంలో నీరవ్, ఆయన మామ మేహుల్ ఛోక్సీలకు చెందిన షేర్లు, మ్యూచ్ వల్ ఫండ్స్  

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన ఆస్తులపై సీబీఐ దాడులు ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని అలీ బాగ్ లో ఉన్న 1.5 ఎకరాల విస్తీర్ణంలో నీరవ్ కు చెందిన ఫామ్ హౌస్, బంగళాను నిన్న సీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, నీరవ్ మోదీ, ఆయన కంపెనీకి చెందిన 9 లగ్జరీ కార్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. అందులో, రోల్స్ రాయిస్, మెర్సిడెజ్ బెంజ్, పోర్సీ పెనామీరా, హోండా, టొయోటా ఫార్చ్యునర్, టొయోటా ఇన్నోవా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, నీరవ్, ఆయన మామ మేహుల్ ఛోక్సీలకు చెందిన రూ.94 కోట్లు విలువ చేసే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నీరవ్ మోదీకి సంబంధించినవి 7 కోట్ల 80 లక్షలు కాగా, మేహుల్ ఛోక్సీవి 86 కోట్ల 76 లక్షల మ్యూచ్ వల్ ఫండ్స్ ఉన్నాయి. 

More Telugu News