sai dharam tej: ఆ సమయంలో సిరివెన్నెల గారి పాట ధైర్యాన్నిచ్చింది: సాయిధరమ్ తేజ్

  • మొదటి సినిమా షూటింగ్ ఆగిపోయింది 
  • అందరూ నన్ను ఐరన్ లెగ్ అన్నారు 
  • అప్పుడు ఆ పాటే ఒత్తిడి నుంచి బయటపడేసింది  

తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, తన కెరియర్ తొలినాళ్లకి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. "వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో 'రేయ్' సినిమా చేశాను .. అదే నా మొదటి సినిమా. ఒక సమయంలో కొన్ని కారణాల వలన ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇంకొక షెడ్యూల్ జరిగితే షూటింగ్ పూర్తవుతుంది.

ఆ సమయంలో శ్రీహరి గారు చనిపోవడంతో, ఆ పాత్ర తాలూకు సన్నివేశాలను రీ షూట్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నన్ను ఐరన్ లెగ్ అన్నారు. ఆ సమయంలో నిజంగా నేను చాలా బాధపడ్డాను. అయితే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారు రాసిన 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' అనే పాట నాకు చాలా స్ఫూర్తిని .. ధైర్యాన్ని ఇచ్చింది. మానసిక పరమైన ఒత్తిడి నుంచి ఆ పాట నన్ను బయటపడేసిందనే అనాలి" అంటూ చెప్పుకొచ్చాడు.  

More Telugu News