mobile phone: చెవుల్లోనే పేలిపోయిన హెడ్ ఫోన్స్.. 17 ఏళ్ల అమ్మాయి దుర్మరణం

  • ఫోన్ ఛార్జింగ్ లో ఉండగానే హెడ్ ఫోన్స్ ద్వారా మాట్లాడిన అమ్మాయి
  • భారీ విద్యుత్ షాక్ కు గురైన బాధితురాలు
  • ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు

హెడ్ ఫోన్లు వాడేవారిని వణికించే దుర్ఘటన ఒకటి బ్రెజిల్ లో సంభవించింది. ఫోన్ ఛార్జింగ్ లో ఉండగానే, హెడ్ ఫోన్ ద్వారా లూయిసా పిన్హిరో (17) అనే అమ్మాయి మాట్లాడుతున్న సందర్భంలో అనూహ్య ప్రమాదం జరిగింది. భారీ విద్యుత్ వల్ల హెడ్ ఫోన్లు పేలిపోయాయి. ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఘటనను గుర్తించిన ఆమె అమ్మమ్మ వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆమె చనిపోయిందంటూ వైద్యులు ధ్రువీకరించారు. భారీ విద్యుత్ షాక్ వల్ల ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. హెడ్ ఫోన్స్ చెవుల్లో కరిగిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ లేదా ట్యాబ్ లను వాడవద్దని మొబైల్ కంపెనీలు, నిపుణులు ఎంతో కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, దీన్ని పట్టించుకోకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

More Telugu News